కొనసాగనున్న మాండోస్ తుఫాను ప్రభావం

మాండోస్ తుఫాను బలహీనపడి ప్రస్తుతం కర్ణాటక లోని మైసూరు దగ్గరగా కదులుతోంది. దీని ప్రభావాన్ని మనం ఫుల్ ఎఫెక్టు అంటారు. నిన్న మనం మాట్లాడుకున్న ఫుల్ ఎఫెక్టు వలన ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కొనసీమ​, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నిన్న పడ్డాయి. ఇదే విధంగా ఈ రోజు, రేపు కూడ కొనసాగనుంది. మాండోస్ తుఫాను బలహీనపడింది కదా ఇంక అంతగా వర్షాలు ఉండవు అని అనుకుంటే పొరపాటే.

ఈ రోజు, రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కోస్తా భాగాలు, లోపల ఉండే భాగాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలుంటాయి. అలాగే తిరుపతి, అన్నమయ్య​, కడప​, బాపట్ల​, కృష్ణా, కొనసీమ​, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంధ్యాల, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. విజయవాడ నగరంలో సాయంకాలం సమయంలో వర్షాలుంటాయి, విశాఖలో అడపదడపగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలూంటాయి.