ఫుల్ ఎఫెక్టు రెండో రోజు – దక్షిణ కోస్తాంధ్ర​, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

Courtesy: windy.com

మాండోస్ తుఫాను ప్రస్తుతం అల్పపీడనంగా అరేబియా సముద్రంలో కొనసాగుతోంది. దీని వలన ఈ రోజు అక్కడక్కడ భారీ వర్షాలు పడనుంది. మాండోస్ తుఫాను ఫుల్ ఎఫెక్టు వలన నేడు నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో భారీ వర్షాలను మనం చూడగలము. ప్రకాశం, కడప​, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో కూడ కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రదేశాల్లో మోస్తరు వర్షాలను చూడగలము. అతిభారీ వర్షాలు ఈ రోజు ఉండవు కానీ భారీ వర్షాలు ఉండటం మాత్రం ఖచ్చితం. అలాగే మధ్యాహ్నం, సాయంకాలం నేడు ఎక్కువ వర్షాలుండనుందది.

మరో వైపున విశాఖ నగరం, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాతో పాటుగా కాకినాడ జిల్లాల్లో 850 hPa గాలులు (అంటే మన భూమి నుంచి 1500 మీటర్ల ఎత్తులో ఉన్నవి) అవి బలహీన పడ్డాయి కాబట్టి తేలికపాటి వర్షాలను సాయంకాలం సమయంలో చూడగలము. అలాగే కొనసీమ​, కృష్ణా, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్.టీ.ఆర్. (విజయవాడ కూడ​), పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మాత్రం అడపదడప వర్షాలు మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో ఉండనుంది. కర్నూలు, నంధ్యాల జిల్లాల్లో కూడ నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయి.

As Cyclone Mandous is pulling moisture from Bay Of Bengal, the pull-effect will cause Heavy Rainfall in Tirupati, Nellore, Anantapur, Sathya Sai, Prakasam and parts of Kadapa, Kurnool, Chittoor districts. More rains during Afternoon/Evening.

Places close to the coast from Visakhapatnam city to Kakinada will see light showers during evening while Krishna, Konaseema, Guntur, NTR (including Vijayawada), Eluru, Bapatla, Palnadu and Ubhaya Godavari will see Moderate showers during Afternoon and Evening.

After reading this post do comment on for more clarity