బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో రెండు మూడు రోజుల వరకు ఉత్తర – ఈశాన్య దిశగా, అలాగే ఉత్తర – వాయివ్య దిశగా కదలనుంది. దీని వలన ప్రభావం ఎలా ఉండనుంది అన్న అంశం గురించి చూస్తే ఇంత కాలం చలి లేదు అని అంటున్న సోదరులకి మరో మూడు రోజులు వరకు అసలైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, అటు విజయవాడ, గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటు రాయలసీమ తీసుకున్నా, చాలా చోట్లల్లో చలి తీవ్రత 14-17 డిగ్రీల వరకు కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తోంది.
అరకు వ్యాలీలో సున్నాకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది, అలాగే మారేడుమిల్లి ప్రాంతం, విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి । నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్త వెచ్చగా ఉండనుంది. ఎందుకంటే మనకు సముద్రం నుంచి తేమ గాలులు వస్తోంది కాబట్టి. డిసెంబరు 25 న ముందు చెప్పిన విధంగానే దక్షిణ కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ప్రారంభించనుంది. దీని వలన మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము.
