COLD WAVE CONDITIONS CONTINUES IN ANDHRA PRADESH

COLD WAVE CONDITIONS CONTINUES IN ANDHRA PRADESH

గత పోష్టులో చెప్పిన విధంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర భారత దేశం నుంచి పొడి గాలులను కిందకి లాగడం వలన చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. పెరిగింది. అలాగే రేపు కూడ ఇలాంటి వాతావరణం కొనసాగనుంది. ఆదివారం (డిసెంబరు 25) నుంచి చలి తగ్గి దక్షిణ ఆంధ్రలో వర్షాలు పెరగనుంది.

విశాఖ నగరంలో కూడ చల్లగా ఉంది. ఈ రోజు వేకువజామున విశాఖ నగరంలో 21 డిగ్రీలు, పక్కనే ఉన్న గోపాలపట్నంలో మాత్రం 17.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

DENSE FOG IN RAYALASEEMA

ఒక పక్కనేమో బంగాళాఖాతంలో వాయుగుండం తేమ గాలులను కడప జిల్లా, ప్రకాశం జిల్లా వరకు తీసుకొచ్చి వదులుతోంది. మరో వైపున అనంతపురం, కర్నూలు, తెలంగాణ నుంచి పొడిగాలులు కిందకి రావడం జరుగుతోంది. ఈ రెండూ కలయిక వలన దట్టమైన పొగ మంచు ఏర్ప​డుతోంది. కడప​, అన్నమయ్య​, పశ్చిమ ప్రకాశం జిల్లాల్లో దీని తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తోంది. రేపు కూడ రాయలసీమ జిల్లాల్లో పొగమంచు ఉంటుంది.

పొగ మంచు సాధారణంగా రాత్రి చల్లటి వాతావరణానికి మొదలౌతుంది. ఎప్పుడైతే గాలిలో తేమ ఉంటుందో, కానీ వేడి అనేది ఉండదో. ఆ తేమ పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడకుండా కింద భూమిపైనే మేఘాలుగా ఏర్పడుతుంది. దీనినే మా భాషలో (Inversion Adiabatic Lapse Rate) అని అంటూ ఉంటాం. దీని వలన​ఏ పొగ మంచు ఏర్పడుతుంది. ఇది సూర్యోదయం అవ్వకముందు ఎక్కువగా ఉండి, సూర్యోదయం అయ్యాక తగినంత వేడి వచ్చాక కింద భూమికి దగ్గరగా ఉన్న మేఘాలు పైకి వెళ్లి సాధారణ మేఘాలుగా ఏర్పడుతుంది. దీనిని మేము Adiabatic Lapse అని అంటాము.

రాత్రి భాగా వర్షం పడి చల్లబడినప్పుడు, అలాగే పగలంతా వేడిగా ఉక్కగా ఉండి రాత్రి భాగా చలి వేస్తే కూడ ఇలాంటి పొగ మంచు ఏర్పడుతుంది.